![]() |
![]() |

ఏక్ నాథ్- హారిక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఐతే ఈటీవీ ప్లస్ లో వచ్చిన నేను శైలజ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నరు ఏకనాథ్, హారిక. ఏక్ నాథ్ ది విజయవాడ కాగా హారికది కాకినాడ. "నేను శైలజ" సీరియల్ తరువాత ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఇద్దరికీ ఈ సీరీయల్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు.
అలా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారు. ఎంతో కస్టపడి యూట్యూబ్ ని డెవలప్ చేసుకున్నారు. ఐతే రీసెంట్ గా వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా తిరుపతి వెళ్లారు. అక్కడ దైవ సన్నిధిలో కొంచెం ప్రశాంతమైన ప్రాంతంలో కూర్చుని ఒక విషయాన్ని తన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. అది వాళ్ళ యూట్యూబ్ కి గోల్డెన్ బటన్ వచ్చింది అని చెప్పారు. "మా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది ఒక టైములో. ఆ టైంలో ఛానెల్ మళ్ళీ తిరిగి వస్తే తిరుమలకు నడిచి వస్తాం అని మొక్కుకున్నాను. ఫైనల్ గా ఈ గోల్డ్ బటన్ ని సాధించాం. ఛానెల్ ని స్టార్ట్ చేసే ముందు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారా ఇంకా ఎక్కువ వస్తారా అనుకున్నాం కానీ ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది మా ఛానెల్. బయటకు వెళ్తే మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారానే గుర్తు పడుతున్నారు. సీరియల్స్ చేసినా రానంత గుర్తింపు యూట్యూబ్ ద్వారా వచ్చింది. అందరికీ థ్యాంక్యూ. " అని చెప్పారు.
![]() |
![]() |